ఎన్నికల వేళ టీ బీజేపీ కీలక నిర్ణయం.. ఆర్టీఐ సెల్ ఏర్పాటు
రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో బీజేపీ ఆర్టీఐ సెల్ ను
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో బీజేపీ ఆర్టీఐ సెల్ ను ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం ఆర్టీఐ సెల్ ను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రకటించారు. ఆర్టీఐ సెల్ కన్వీనర్ గా శ్రీనివాస్ ను నియమించారు. జాయింగ్ కన్వీనర్లుగా పవన్ మైత్రేయ, రామ్మోహన్ రెడ్డి, సభ్యులుగా నవీన్, ఝాన్సీ, కృష్ణను నియమించారు.
ఇదిలా ఉండగా విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని వేడుకలు నిర్వహించేందుకు సైతం బీజేపీ రాష్ట్ర నాయకత్వం 17 మందితో కూడిన కమిటీని ఏర్పాటుచేసింది. కమిటీ చైర్మన్ గా జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారిని నియమించారు. ఈ కమిటీలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ, ఆలె భాస్కర్, రాములు, రాజయ్య, రాజేశ్వరి, బ్రహ్మచారి, వికాస్, శ్రీధర్, రాజ్ శ్రీరాల, భీంరావు, పవన్, వెకంటేశ్, మోహన్ కృష్ణ, సంజయ్ ఘనాతే, నాగ పరిమళను నియమించారు.