ఫోర్త్ ఫేజ్ షెడ్యూల్ ఖరారు.. రోజుకు 'బండి' ఎన్ని కిలోమీటర్లు తిరగనున్నారో తెలుసా?

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న నాలుగో విడుత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ఖారారైంది. 10 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది.

Update: 2022-09-04 17:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న నాలుగో విడుత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ఖారారైంది. 10 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. ఈనెల 12వ తేదీన ప్రారంభంకానున్న ఈ యాత్ర 22వ తేదీ వరకు కొనసాగనుంది. కుత్బుల్లాపూర్ నుంచి బండి సంజయ్ తన ఫోర్త్ ఫేజ్ పాదయాత్రను కొనసాగించనున్నారు. ఇబ్రహీంపట్నం వరకు ఈ యాత్ర సాగనుంది. నాలుగో విడుతలో మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బండి తన పర్యటన సాగించనున్నారు. రోజుకు కనీసం 10 కిలోమీటర్ల చొప్పున బండి నడవనున్నారు. కుత్బుల్లాపూర్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా కొనసాగనుంది. 22వ తేదీన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ముగించనున్నారు. ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా ఈనెల 17న పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవాలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పాదయాత్రకు ఒక రోజు బండి సంజయ్ బ్రేక్ ఇవ్వనున్నారు. అనంతరం యథావిధిగా తన యాత్రను కొనసాగించనున్నారు.

Tags:    

Similar News