Hyderabad : సమ్మెకు పిలుపునిచ్చిన తెలంగాణ ఆటో డ్రైవర్ల సంఘం

తెలంగాణ ఆటో డ్రైవర్ల సంఘం సమ్మె(Auto Drivers Strike)కు పిలుపునిచ్చింది.

Update: 2025-02-12 14:47 GMT
Hyderabad : సమ్మెకు పిలుపునిచ్చిన తెలంగాణ ఆటో డ్రైవర్ల సంఘం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఆటో డ్రైవర్ల సంఘం సమ్మె(Auto Drivers Strike)కు పిలుపునిచ్చింది. ఆటో డ్రైవర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని, లేదంటే ప్రభుత్వానికి తమ నిరసన సెగ తప్పదని హెచ్చరిస్తున్నారు ఆటో డ్రైవర్ల సంఘాలు. తెలంగాణ ఆటోడ్రైవర్ల జేఎసీ(Telangana Auto Drivers JAC) కన్వీనర్ వెంకటేశం మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని కాంగ్రెస్ విస్మరించిందని అన్నారు. అందుకు నిరసనగా ఈనెల 15న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని, 24న అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి మద్ధతు కోరతామని తెలియజేశారు. ఇదివరకే నాలుగు నెలల క్రితం తాము సమ్మెకు పిలుపునిచ్చామని.. అప్పుడు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(Minister Ponnam Prabhakar Goud) తమని ఇంటికి పిలిచి చర్చలు జరిపి.. ఇపుడు పట్టించుకోవడం లేదన్నారు. రానున్న తెలంగాణ బడ్జెట్ లో ఆటో కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, నిధులు విడుదల చేయాలన్నారు. మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme)తో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులకు నెలకు రూ.12 వేలు ఇస్తామన్న హామీని వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News