TechTEEP: ఆరేళ్లుగా ప్రకటనలకే టీ –ప్రైమ్ పథకం.. టెక్ టీప్ డైరెక్టర్ ఖాద్రీ
ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తల(SC And ST Entrepreneurs) టీ–ప్రైడ్(T-Pride) తరహాలోనే మైనారిటీ(Minority) ఔత్సాహిక పారిశ్రామిక వేతలను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం తీసుకువచ్చిన టీ–ప్రైమ్ స్కీం(T-Prime Scheme) ప్రకటనలకే పరిమితం అయింది.
దిశ; తెలంగాణ బ్యూరో: ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తల(SC And ST Entrepreneurs) టీ–ప్రైడ్(T-Pride) తరహాలోనే మైనారిటీ(Minority) ఔత్సాహిక పారిశ్రామిక వేతలను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం తీసుకువచ్చిన టీ–ప్రైమ్ స్కీం(T-Prime Scheme) ప్రకటనలకే పరిమితం అయింది. కేవలం జీవో(GO)లకు పరిమితం చేసి మైనార్టీల సంక్షేమాన్ని(Welfare Of The Minorities) పక్కకు పడేశారు. ఇప్పటి వరకు వర్కింగ్ పాలసీ, గైడ్ లైన్స్ ఇవ్వలేదు. దీంతో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) టీ ప్రైమ్ పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలని తెలంగాణ చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ ప్రమోషన్(Telangana Chamber Of Trade And Industries Promotion) (టెక్ టీప్ )(TechTEEP) వ్యవస్థాపక డైరెక్టర్ అబూ ఫతేసయ్యద్ బందగీ బాషా రియాజ్ ఖాద్రీ(Abu Fatesayed Bandagi Basha Riaz Qadri) కోరారు. సోమవారం మైనార్టీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. ఈ స్కీమ్ అమలు లేకపోవడంతో స్వయం ఉపాధి నోచుకోవడం లేదన్నారు.
గత ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో ఒక పర్యాయం నిధులు కేటాయించినా, మార్గదర్శకాలు రూపొందిచక పోవడంతో పథకం అమలు అటకెక్కిందని గుర్తు చేశారు. దళితరుల తరహాలోనే మైనారిటీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సమానంగా ప్రయోజనాలు కల్పించేందుకు గీన్ సిగ్నల్ ఇస్తూ 2018 మార్చి 3న జీవో నెంబర్ 16 ద్వారా టీ–ప్రైమ్ స్కీమ్ కు జీవో ఇచ్చి, తర్వాత రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 25 కోట్లు కూడా కేటాయించారన్నారు. కేవలం మార్గదర్శకాలు లేవనే కారణంతో దీన్ని పెండింగ్ లో పెట్టారన్నారు. దీని వలన మైనార్టీ వర్గాలు నష్టపోతున్నాయన్నారు. ముస్లింల జీవన పరిస్థితి దళితుల కంటే అధ్వానంగా ఉన్నాయని సచార్, రంగానాధ్ మిశ్ర కమిటీలు స్పష్టం చేశాయని రియాజ్ ఖాద్రీ తెలిపారు. మైనార్టీలు అధిక శాతం ట్రాన్స్‌పోర్టు, హోటల్, సర్వీస్, నిర్మాణ రంగాల్లో కొనసాగుతున్నారని, వారికి కనీస ఆర్థిక ప్రోత్సాహం లేదన్నారు.
ఔత్సాహికులను ప్రోత్సహిస్తే మైనార్టీ వర్గాల అభివద్ది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వాస్తవంగా ముస్లిం మైనారిటీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌లకు క్రెడిట్ సౌకర్యం పబ్లిక్ రంగం, ప్రయివేటు రంగం బ్యాంకులతోపాటు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐడీబీఐ) నుంచి కూడా మొండి చేయి లభిస్తోందని, మైనారిటీ ప్రాబల్యం గల ప్రాంతాలను బ్యాంకులు నెగిటివ్, రెడ్ మార్క్ వేశాయన్న విషయం సైతం సుదీర్ కమీషన్ సర్వేలో వెల్లడైందని పేర్కొన్నారు. టీ–ప్రైమ్ అమలు చేస్తే ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండా పరిశ్రమల స్థాపనకు రుణాలు, ప్రోత్సాహకాలు, రాయితీలు అందుతాయని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. మైనార్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు టీప్రైమ్ వరప్రసాదంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి నవంబర్ 11న నిర్వహించే జాతీయ మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో టీ–ప్రైమ్ స్కీమ్ అమలుపై ప్రకటన చేసి మైనారిటీల పట్ల చిత్తశుద్దిని చాటుకోవాలని టెక్‌టిప్ డైరెక్టర్ ఖాద్రీ విజ్ఞప్తి చేశారు.