ఇరాక్ లో తెలంగాణ వాసుల కన్నీటి కష్టాలు

Update: 2024-10-02 04:48 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళి ఇబ్బందులు పడుతున్న కార్మికుల దీనగాధలు తరచు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఇరాక్ లో చిక్కుకున్న ముగ్గురు తెలంగాణ వాసులు తమను ఇండియాకు తీసుకెళ్ళాలంటూ మొరపెట్టుకుంటున్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన ధర్మపురి పోరన్నపల్లేకు చెందిన సత్తయ్య, బుగ్గారం మండలం సిరికొండ బట్టు హరీష్, నిజామాబాద్ జిల్లా తల్లెదారిపల్లెకు చెందిన రాజన్నలు ఎజన్సీ మాటలు నమ్మి రెండేళ్ళ క్రితం ఇరాక్ దేశానికి ఉపాధి కోసం వెళ్ళారు. యాజమాని తమకు నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, తిరిగి తమను ఇండియాకు పంపాలని కోరితే పంపడం లేదని, తిండిలేక ఇబ్బందులు పడుతున్నామని బాధిత కార్మికులు వాపోయారు. ఆడియో వాయిస్ ద్వారా వారు తమ సమస్యలను మీడియాకు పంపించారు. ప్రజావాణిలో, భారత ఎంబసీలో బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేయగా, యజమాని కక్షతో మమ్మల్ని చితకబాదాడని వారు తెలిపారు. తమను ఎలాగైనా స్వదేశానికి తీసుకెళ్ళాలంటూ వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.


Similar News