దొర కలగన్నాడు.. కేసీఆర్‌పై T-కాంగ్రెస్ సంచలన ట్వీట్

మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌పై టీ-కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసింది.

Update: 2024-06-26 07:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌పై టీ-కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసింది. ఆ దొర కలగన్నాడు.. తాను కట్టుకున్న గడీ గోడలు శాశ్వతం అనిదొర అనుకున్నాడు.. ఎన్నికలయ్యాక ప్రజలతో నాకేం పని అని! ఆ దొర తనకడ్డు లేదనుకున్నాడు.. అధికార మదం, అవినీతి సొమ్ము అండగా ఉన్నాయని! ఆ దొర పొరపాటు పడ్డాడు.. ప్రజా గొంతులను శాశ్వతంగా అణగదొక్కచ్చని! ఆ దొర భంగపడ్డాడు.. ప్రజా బలాన్ని తక్కువగా అంచనా వేశా అని! ఆ దొర అయోమయంలో పడ్డాడు.. ప్రజా పాలనతో తన గడీల పాలనకు శాశ్వత ముగింపు అని!

ఆ దొర భయపడ్డాడు.. తెలంగాణ కోరుకున్న నిజమైన నాయకుడు వచ్చాడని! ఆ దొర డీలా పడ్డాడు.. ఆ నాయకుణ్ణి ఢీకొట్టే సత్తా వాళ్ళకెవరికీ లేదని! ఆ దొర వేడుకున్నాడు.. అసత్య ప్రచారాలు, వ్యక్తిత్వ హననంతో కొంతైనా తన పరువు కాపాడాలని.. ఆ దొర మళ్లీ నిద్రపోయాడు.. ఈరోజుకి బురద జల్లే కార్యక్రమం ముగిసిందని! అంటూ సెటైర్లు వేసింది. 


Similar News