హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై సంచలన ఆరోపణలు చేసిన టీసీఏ

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంచలన ఆరోపణలు చేసింది.

Update: 2024-08-30 12:31 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంచలన ఆరోపణలు చేసింది. టీసీఏ అధ్యక్షడు, ప్రధాన కార్యదర్శి శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో.. హెచ్ సీఏ ఆర్థిక దుర్వినియోగానికి పాల్పడిందని తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. బీసీసీఐ కేటాయించిన నిధుల్లో అనేక అవకతవకలు జరిగాయని, వెంటనే వీటిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. హెచ్ సీఏ అధ్యక్షునిగా అజారుద్దిన్ ఉన్నప్పుడు అవినీతి జరిగిందని, దీనిపై తాము బీసీసీఐకి ఫిర్యాదు చేశామని అన్నారు. ఇప్పుడున్న జగన్ మోహన్ కూడా మళ్ళీ అలాంటి అవినీతికి తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే హెచ్ సీఏను రద్దు చేయాలని టీసీఏ ప్రధాన కార్యదర్శి గురువా రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. హెచ్ సీఏ ఆర్థిక అవినీతి మీద సుప్రీం కోర్టు అక్షింతలు వేసినా.. తీరు మార్చుకోలేదని వ్యాఖ్యానించారు. 


Similar News