హుక్కా సెంటర్‌పై టాస్క్ఫోర్స్పోలీసుల దాడి
విశ్వసనీయ సమాచారం మేరకు సెంట్రల్జోన్టాస్క్ఫోర్స్పోలీసులు హుక్కా సెంటర్‌పై మంగళవారం దాడి చేశారు. పెద్ద సంఖ్యలో హుక్కా పాట్లతో పాటు వేర్వేరు ఫ్లేవర్ల హుక్కా పొడి ప్యాకెట్లు, ఎనిమిదివేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: విశ్వసనీయ సమాచారం మేరకు సెంట్రల్జోన్టాస్క్ఫోర్స్పోలీసులు హుక్కా సెంటర్‌పై మంగళవారం దాడి చేశారు. పెద్ద సంఖ్యలో హుక్కా పాట్లతో పాటు వేర్వేరు ఫ్లేవర్ల హుక్కా పొడి ప్యాకెట్లు, ఎనిమిదివేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన ఇమ్రాన్(29) కొంతకాలం క్రితం నాంపల్లి యూసుఫైన్దర్గా చౌరస్తాలో ఉన్న మెరీడియన్హోటల్పై అంతస్తులో దుబాయ్షీషా లాంజ్పేర హుక్కా సెంటర్నడిపిస్తున్నాడు.
ఈ సెంటర్‌ను నడిపించటంలో అతనికి మహ్మద్సుల్తాన్, షేక్ఎజాజ్, షేక్సయీద్ సహకరిస్తున్నారు. కాగా, మైనర్లకు కూడా నిర్వాహకులు హుక్కా తాగే అవకాశం కల్పిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు ఎస్సై నవీన్కుమార్మంగళవారం దీనిపై దాడి చేశారు. నిర్వాహకుడు ఇమ్రాన్తప్పించుకుని పారిపోగా మిగితా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతోపాటు హుక్కా సేవిస్తున్న పదమూడు మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు.