ఎమ్మెల్సీ కవిత ఆందోళనకు మద్దతు: బీఆర్ఎస్ ఎన్నారై సంఘం
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల చట్టం తేవాలని ఎమ్మెల్సీ కవిత చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు టాంజానియా బీఆర్ఎస్ ఎన్నారై అధ్యక్షుడు వంగా నర్సింహారెడ్డి తెలిపారు...
దిశ, తెలంగాణ బ్యూరో: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల చట్టం తేవాలని ఎమ్మెల్సీ కవిత చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు టాంజానియా బీఆర్ఎస్ ఎన్నారై అధ్యక్షుడు వంగా నర్సింహారెడ్డి తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం ఎమ్మెల్సీ కవిత చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కో -ఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపు మేరకు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. గురువారం టాంజానియాలో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ పండుగ ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి ముఖ్య కారణం భారత్ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత అని తెలిపారు. విదేశాల్లో ఉంటూ కూడా బతుకమ్మ పండుగ ప్రాముఖ్యాన్ని తమ పిల్లలకు తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం మహిళలందరినీ ఏకం చేసి కవిత ఖచ్చితంగా చట్టాన్ని సాధిస్తారని వంగ నర్సింహారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
గత యూపీఏ ప్రభుత్వ హయాంలో రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించింది. కానీ, మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్ ఆమోదించాలంటే పార్టీల మధ్య ఏకాభిప్రాయం రావాలని అధికార బీజేపీ సన్నాయి నొక్కులు నొక్కుతుందని విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత చేపట్టిన కార్యక్రమానికి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ టాంజానియా అడ్వైసర్స్ సంతోష్ రెడ్డి పట్లోల, సురేందర్ సెలం, సూర్య మోహన్ రెడ్డి, మధురెడ్డి, కార్యవర్గ సభ్యులు శ్రీనిలై, చారి గుడికందుల, ప్రణీత్ రెడ్డి, వెంకటేష్, రాజేష్, మహేష్ రెడ్డి, సురేష్, రాజు, పెర్రి కౌశిక్, శేషు, శ్రవణ్, శ్రీనివాస్, శ్రీధర్, ప్రవీణ్, మధుసూదన్ రెడ్డిలు తెలిపారు. ఈ సమావేశంలో మహిళలు కూడా పాల్గొన్నారు.