షర్మిల అలా మాట్లాడటం కరెక్ట్ కాదు: తమ్మినేని వీరభద్రం ఆగ్రహం
టీ- సేవ్ పేరుతో ప్రతిపక్షాలన్నీ ఏకం అయ్యి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేద్దామని కోరుతూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్‌లోని సీపీఎం కార్యాలయంలో తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో భేటీ అయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: టీ- సేవ్ పేరుతో ప్రతిపక్షాలన్నీ ఏకం అయ్యి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేద్దామని కోరుతూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్‌లోని సీపీఎం కార్యాలయంలో తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో భేటీ అయ్యారు. పేపర్ లీకేజీపై పోరాటం, ప్రతిపక్షాలపై ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరుపై వీరు చర్చించారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడుతూ.. వామపక్షాలు బీఆర్ఎస్‌కు బీ-టీమ్‌గా పని చేస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీఎం కార్యాలయానికి వెళ్లి.. ఏకంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముందే షర్మిల ఈ విధంగా మాట్లాడటం హాట్ టాపిక్‌గా మారింది. షర్మిల వ్యాఖ్యలపై తమ్మినేని వీరభద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
షర్మిల అలా మాట్లాడటం కరెక్ట్ కాదని.. ఆమె వ్యాఖ్యలను ఖండించారు. సోదరి వైఎస్ షర్మిల ఆ గౌరవం నిలుపుకోవడం లేదన్నారు. మేము చాటుగా బీఆర్ఎస్‌కి మద్దతు ఇవ్వలేదని తెలిపారు. మేము బీ- టీం అని మా ఆఫీస్‌కి వచ్చి మాట్లాడే సాహసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీలో నిజాలు బయటికి రావాలి అంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీజేపీతో కలసి పనిచేయడం అనేది జరగదని తేల్చి చెప్పారు.
Read More: