కేసీఆర్‌పై డైరెక్ట్‌గా తమిళిసై ఫైర్
పుదుచ్చేరిలో తెలంగాణలో పరిస్థితులను అక్కడి మీడియా ప్రశ్నించగా గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్‌పై మరోసారి ఫైర్ అయ్యారు.
దిశ, వెబ్ డెస్క్: పుదుచ్చేరిలో తెలంగాణలో పరిస్థితులను అక్కడి మీడియా ప్రశ్నించగా గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్‌పై మరోసారి ఫైర్ అయ్యారు. తెలంగాణలో అన్నీ అతిక్రమణలే అని గవర్నర్ అన్నారు. రాజ్యాంగ, రాజకీయ, చట్టపరమైన అతిక్రమణలున్నాయన్నారు. రాజ్యాంగ నిబంధనలను రాష్ట్రంలో ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. గణతంత్ర వేడుకలను నిర్వహించకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం చెప్పిన కరోనా సాకు నవ్వు తెప్పించిందన్నారు. కోర్టు చెప్పిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం వేడుకలను నిర్వహించలేదన్నారు. ఆయన మాత్రం 5లక్షల మందితో సభ పెట్టుకున్నారని సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.
తెలంగాణలో ఏం జరుగుతోందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అగౌరపరిచిన తీరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రజల మధ్య గణతంత్ర వేడుకలు జరగకుండా చేయాలని యత్నించారన్నారు. గణతంత్ర వేడుకలను ఘనంగా జరపాలని 2 నెలల క్రితమే ప్రభుత్వానికి లేఖ రాశానన్నారు. రాజ్ భవన్ లోనే జరుపుకోవాలని 2 రోజుల క్రితమే సమాచారం ఇచ్చారన్నారు.
ఏదేమైనా కేంద్రానికి తాను ఇవ్వాల్సిన రిపోర్ట్ ఇచ్చానన్నారు. అయితే ఈ ఉదయం రాజ్ భవన్‌లో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ మాట్లాడుతూ.. అభివృద్ధి అంటే కొత్త భవనాలు, ఫామ్ హౌజ్‌లు నిర్మించడం మాత్రమే కాదన్నారు. ఎవరికీ నచ్చకపోయినా తెలంగాణ అభివృద్దికి నిత్యం కృషి చేస్తానని రాష్ట్ర పభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఎమ్మెల్సీ కవిత, స్పీకర్ పోచారం, గుత్తా, కేకే ఆమెపై మాటల దాడికి దిగిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి: