బ్రేకింగ్: T-బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసిన రాష్ట్ర మహిళా కమిషన్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాష్ట్ర మహిళా కమిషన్ సోమవారం నోటీసులు జారీ చేసింది.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాష్ట్ర మహిళా కమిషన్ సోమవారం నోటీసులు జారీ చేసింది. బుధవారం వ్యక్తిగతంగా కమిషన్ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను ఉద్దేశిస్తూ ఇటీవల బండి సంజయ్ కుంభకోణాలకు పాల్పడితే అరెస్టు చేయకుండా ముద్దు పెట్టుకుంటారా? అని వ్యాఖ్యానించారు. దీనిపై బీఆర్ఎస్ వర్గాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్‌కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టటంతో పాటు ఆయన దిష్టిబొమ్మలను కూడా దహనం చేశాయి.
ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఎదుట కూడా బండి సంజయ్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్నాయకులు దహనం చేశారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా యాభైకి పైగా పోలీస్స్టేషన్లలో బండి సంజయ్‌కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు కేసులు కూడా నమోదయ్యాయి. కాగా, బండి సంజయ్ వ్యాఖ్యలను రాష్ట్ర మహిళ కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. తాజాగా సోమవారం బండి సంజయ్‌కి నోటీసులు జారీ చేస్తూ బుధవారం వ్యక్తిగతంగా కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు వచ్చినపుడు స్పందిస్తా అని ఇంతకు ముందు బండి సంజయ్ అన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఉదంతం అన్నివర్గాల్లో ఆసక్తికరంగా మారింది.