Supreme Court: ఎంబీబీఎస్ ప్రవేశాల్లో స్థానికతపై ముగిసిన వాదనలు.. తీర్పు వాయిదా వేసిన హైకోర్టు ధర్మాసనం

ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో స్థానికతపై తాజాగా వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన జీవోను సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు హైకోర్టులో వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

Update: 2024-08-29 16:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో స్థానికతపై తాజాగా వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన జీవోను సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్‌పై సీజే ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.శ్రీనివాసరావులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే పక్క రాష్ట్రంలో ఇంటర్ చదివినా విద్యార్థులు స్థానికతను కోల్పోతున్నారని పిటిషర్లు తమ గోడును వెల్లబోసుకున్నారు. అదేవిధంగా గతంలో అహ్మదాబాద్‌ నగరంలోనూ ఇలాంటి జీవోనే విడుదల చేయడంతో అక్కడి హైకోర్టు కొట్టివేసిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది మయూర్‌రెడ్డి ధర్మాసనానికి వివరించారు. నీట్ ఎలాగైన అత్యుత్తమ ర్యాంకు సాధించాలనే ఉద్దేశంతో ఇక్కడి విద్యార్థులు పక్క రాష్ట్రానికి వెళ్లారని కోర్టుకు విన్నవించారు. అనంతరం ప్రభుత్వ తరఫు న్యాయవాది సమాధానమిస్తూ.. రాష్ట్ర విద్యార్థులకు న్యాయం జరగాలనే స్థానికతపై కొత్త జోవోను తీసుకొచ్చామని వివరించారు. ఈ క్రమంలోనే రేపటిలోగా రాతపూర్వక వాదనలు సమర్పించాలని ఇరు పక్షాలను హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా తీర్పును వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. 


Similar News