దంచికొడుతున్న ఎండలు.. నేడు, రేపు జాగ్రత్త
ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఉదయం తొమ్మిది కాకముందే భానుడు భగ భగలతో విరుచుక పడుతున్నాడు. ఈ నేపథ్యంలో
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఉదయం తొమ్మిది కాకముందే భానుడు భగ భగలతో విరుచుక పడుతున్నాడు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. నేడు, రేపు ఎండలు దంచి కొట్టనున్నాయని, తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉన్నందున ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకు రాకూడదంటూ తెలిపింది.
ఇక తెలంగాణలో 41 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 43 డిగ్రీల సెంటీ గ్రేడ్ మధ్య నమోదు అయ్యే అవకాశం ఉందని, ఏపీలో వడగాలులు వీచే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర పెరగనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.