ఓయూలో ఘనంగా ప్రారంభమైన స్తుతి వర్క్‌షాప్

"సినర్జిటిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ యుటిలైజింగ్ ది సైంటిఫిక్ అండ్ టెక్నాలజీకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్" వర్క్‌షాప్ ప్రారంభమైంది.

Update: 2023-01-19 03:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) సౌజన్యంతో ఉస్మానియా యూనివర్సిటీలోని పర్యావరణ శాస్త్ర విభాగం మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వరంగల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న "సినర్జిటిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ యుటిలైజింగ్ ది సైంటిఫిక్ అండ్ టెక్నాలజీకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (స్తుతి)-2023" వర్క్‌షాప్ 18-01-2023 బుధవారం నాడు ఘనంగా ప్రారంభమైంది.

నేటి నుండి ఈనెల 24 వరకు వారం రోజుల పాటు ఈ వర్క్ షాప్ జరుగనుంది. ఓయూ సైన్స్ కళాశాలలోని ప్రిన్సిపాల్ ఆఫీస్ సెమినార్ హాల్లో ప్రారంభమైన సదస్సుకు సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి. వీరయ్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఓయూ ఓఎస్డి ప్రొఫెసర్ రెడ్యా నాయక్, యుజీసీ డీన్ ప్రొఫెసర్ జి. మల్లేశం, పర్యావరణ శాస్త్ర విభాగాధిపతి మరియు వర్క్ షాప్ కన్వీనర్ ప్రొఫెసర్ కె. శైలజ, కోఆర్డినేటర్ ప్రొఫెసర్ బి.రమాదేవి, వృక్ష శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ పి. కమలాకర్, నిట్ వరంగల్ సైంటిఫిక్ ఆఫీసర్ జి.ఎస్.ఆర్. సంజీవని పాల్గొని విద్యార్థులు, పరిశోధకులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ "రోజు రోజుకీ పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది. ప్రణాళిక బద్దంగా లేని నగరీకరణ, పారిశ్రామీకరణ వల్ల పెరుగుతున్న గాలి, నేల, నీటి కాలుష్యాలు మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. అనేక వృక్ష, జంతు జాతులు కాలుష్య బారిన పడి అంతరించిపోతున్నాయి. ఇలాంటి సందర్భంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ బూని పని చేయాలి." అన్నారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ప్రొ. సుజాత, ప్రొ.సభిత, డా. నాగేశ్వర్ రావు, డా. విజయ్ భాస్కర్, డా.కిరణ్, డా. సాయేద అజీమా, డా. శశికళ, డా. మంచాల లింగస్వామి, కె. సృజన్, బి.భీమ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Also Read....

8వ నిజాం ముకర్రం జా మృతితో ఖాళీ అయిన నిజాం ట్రస్ట్‌ల చైర్మన్​పదవి.. ఆ అస్తులను కాపాడేదేవరు..? 


Similar News