ఈటల ఇంటిని ముట్టడించిన విద్యార్థి సంఘాలు

నీట్ పరీక్షతో పేద విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు రాహుల్ యాదవ్ అన్నారు.

Update: 2024-06-28 08:15 GMT

దిశ, మేడ్చల్ టౌన్: నీట్ పరీక్షతో పేద విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు రాహుల్ యాదవ్ అన్నారు. నీట్ పరీక్ష లీకేజీ చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం విద్యార్థి సంఘాల పిలుపుమేరకు మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ ఈటల రాజేందర్ ఇంటినీ ఎన్‌ఎస్‌యు ఐ ఎస్ ఎఫ్ ఐ నాయకులు ముట్టడించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సంతోష్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలను రోడ్డుపాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం స్పందించి.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన వారిని సీబీఐతో విచారణ చేయించి కఠినంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు


Similar News