డోర్నకల్‌లో ఓటర్ల వింత డిమాండ్.. ఆ పని చేసిన వారికే గుంపగుత్తగా ఓట్లు వేస్తామని నిర్ణయం..!

తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రజలను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో డోర్నకల్ నియోజకవర్గంలోని ఓ గ్రామ ప్రజల

Update: 2023-11-17 07:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రజలను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో డోర్నకల్ నియోజకవర్గంలోని ఓ గ్రామ ప్రజల డిమాండ్ ఆకట్టుకుంటోంది. తాళ్లసంకీస గ్రామస్తులు కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ సమస్య పరిష్కారం కోసం ఎన్నికల వేళ వినూత్నంగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతులు తమ గ్రామంలోని పంటపొలాలను నాశనం చేస్తున్నాయని.. దీని వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే అభ్యర్థికే మా గ్రామ ప్రజలంతా ఓటు వేస్తామంటూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గ్రామంలో ఫ్లెక్సీని సైతం ఏర్పాటు చేశారు. గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి ఈ సమస్యకు ఏ పార్టీ అభ్యర్థి స్పష్టమైన హామీ ఇస్తారో చూడాలి.

 

Tags:    

Similar News