పార్లమెంట్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న ఎంపీలు.. వీడియో వైరల్
చట్టసభలలో రాజకీయ నాయకుల శృతిమించే వ్యాఖ్యలు చూస్తూనే ఉంటాం. కానీ నిండు సభలో ఎంపీలు పరస్పరం తన్నుకోవడం సెనెగల్ పార్లమెంట్ కలకలం
దిశ, డైనమిక్ బ్యూరో : చట్టసభలలో రాజకీయ నాయకుల శృతిమించే వ్యాఖ్యలు చూస్తూనే ఉంటాం. కానీ నిండు సభలో ఎంపీలు పరస్పరం తన్నుకోవడం సెనెగల్ పార్లమెంట్ కలకలం సృష్టించింది. సెనెగల్ ప్రతిపక్ష పార్టీ నాయకుడు మన్సాట్ సంబ్ తోటి మహిళ ఎంపీ యామి నదియా గింబే వద్దకు వచ్చి చెంబదెబ్బ కొడ్డాడు. ఈ ఘటనతో సభలో ఒక్కసారికా ఉద్రిక్తత చోటు చేసుకుంది. తనపై చెంప దెబ్బ కొట్టిన మన్సాట్ సంబ్ పై యామి నదియా అక్కడే ఉన్న కుర్చీని తీసుకుని విసిరింది. ఈ చర్యతో సభలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ప్రస్తుత దేశాధ్యక్షుడు సాల్ ను మూడో సారి పదవి కట్టబెట్టడానికి ఓ ఆధ్యాత్మిక గురువు వ్యతిరేకంగా ఉన్నాడు.
అయితే దీనిని ఎంపీ గింబే తప్పు పట్టారు. ఆమె వైఖరిపై ప్రతిపక్ష నాయకుడు సంబ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో గింబే ఆయనను వెక్కించినట్టు తెలుస్తోంది. దీంతో గింబే కూర్చున్న చోటుకు వచ్చిన సంబ్ ఆమెను చెంప దెబ్బకొట్టాడు. దీంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరువర్గాల సభ్యులు పరస్పరం దూషించుకుంటూ ఉద్రిక్తతకు కారణం అయ్యారు. దేశానికి గుండెకాయగా భావించే పార్లమెంట్ సభలో సభ్యుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈ వ్యవహారంతో పార్లమెంట్ సెషన్ ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన శుక్రవారమే చోటు చేసుగా కాస్త ఆలస్యంగా ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. కాగా సెనెగల్ పార్లమెంట్ కు గత జులై లో ఎన్నికలు జరగ్గా అప్పటి అధికార పార్టీ ఓడిపోయింది. దాంతో అక్కడ అధికార-ప్రతిపక్షాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు నిత్యకృత్యం అయ్యాయి.