''మునుగోడు కౌంటింగ్ తక్షణమే నిలిపివేయండి.. అది ఓటర్లే స్వయంగా ఒప్పుకుంటున్నారు''
మునుగోడులో విచ్చలవిడిగా డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని.. అందువల్ల మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్‌ను తక్షణమే నిలివేయాలని మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి శనివారం ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడులో విచ్చలవిడిగా డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని.. అందువల్ల మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్‌ను తక్షణమే నిలివేయాలని మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి శనివారం ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ తమకు డబ్బులు పంచాయని అని ఓటర్లే స్వయంగా చెబుతున్నారని, ఇందుకు సోషల్ మీడియాలో అనేక రుజులువు వీడియోల రూపంలో ఉన్నాయని అన్నారు. ఈ వీడియోల్లో తమకు టీఆర్ఎస్ రూ.5 వేలు, బీజేపీ రూ.4 వేల చొప్పున డబ్బులు ఇచ్చారని ఓట్లరు చాలా క్లియర్‌గా చెబుతున్నారని, వీటికి సంబంధించిన ఆధారాలు ఓపెన్‌గా పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయని అన్నారు.
ఈ వీడియోలను తాను కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సైతం ట్విట్టర్ ద్వారా పంపించానని.. అయినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని ఈ ఎన్నికను రద్దు చేసి కౌంటింగ్‌ను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ప్రలోభాలకు గురి చేయకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నప్పటికి ఇంత మొత్తంలో నగదు ఎలా చేతులు మారిందని ప్రశ్నించారు. పెద్ద మొత్తంలో ధన ప్రవాహం జరుగుతుంటే పోలీసులు, సెంట్రల్ గవర్నమెంట్ అబ్జర్వర్లు ఏమయ్యారని నిలదీశారు. మునుగోడులో ప్రజాస్వామ ప్రక్రియను ఖూనీ చేసే విధంగా టీఆర్ఎస్, బీజేపీ ప్రవర్తించాయని అందువల్ల వెంటనే మునుగోడు ఉప ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Read more :