ఆ సమయంలో ఇంట్లో నుండి బయటకు రావొద్దు: రాష్ట్ర ప్రజలకు హెల్త్ డైరెక్టర్ కీలక సూచన
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయని, సగటున 42 డిగ్రీలు నమోదవుతుండటంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని వైద్యారోగ్యశాఖ ప్రజా రోగ్య సంచాలకులు డా జీ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయని, సగటున 42 డిగ్రీలు నమోదవుతుండటంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని వైద్యారోగ్యశాఖ ప్రజా రోగ్య సంచాలకులు డా జీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో హీట్ వేవ్అలర్ట్ ఉన్నట్లు మంగళవారం మీడియాకు తెలిపారు. మరో వారం రోజుల పాటు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్యలో బయటకు రావొద్దని సూచించారు. అత్యవసరమైతేనే తగిన జాగ్రత్తలతో వెళ్లాలన్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఎండ సమయంలో ఇళ్లకే పరిమితం కావాలన్నారు.
ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బొనేటెడ్ సాప్ట్డ్రింక్స్, హై ప్రోటీన్పుడ్వంటివి తీసుకోవద్దన్నారు. స్కిన్ మీద రెడ్రసేష్, డ్రై స్కిన్, హెడ్ఏక్, మజిల్ నొప్పులు వంటివి ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలన్నారు. కనీసం ప్రతీ రోజు మూడు లీటర్ల నీటిని తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. సీజనల్ప్రూట్స్ను ఎక్కువగా తినాలన్నారు. ఎండ తాకిడి తగలకుండా గొడుగు, క్యాప్, పుల్ హ్యాండ్ దుస్తులు వంటివి ధరించాలన్నారు. వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు న్యూస్లో తెలుసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.