దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మణిపూర్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులు, పౌరులతోపాటు తెలుగు వారిని ఇక్కడికి తీసుకు రావటానికి వెళ్లిన విమానం రాత్రి 11గంటలకు అక్కడి నుంచి బయల్దేరనున్నట్టు సమాచారం. రేపు ఉదయం విమానం శంషాబాద్‌విమానాశ్రయానికి చేరుకుంటుందని తెలిసింది. కాగా, ఇప్పటికే హర్షవర్దన్అనే విద్యార్థి ఢిల్లీకి విమానంలో చేరుకున్నట్టు తెలిసింది. అతనికి ఈ రోజు రాత్రి బీఆర్ఎస్ కార్యాలయంలో బస ఏర్పాటు చేసినట్టు సమాచారం. రిజర్వేషన్ల విషయమై తలెత్తిన వివాదం మణిపూర్‌లో తీవ్ర హింసకు దారి తీసిన విషయం తెలిసిందే. పరస్పరం జరుపుకున్న దాడుల్లో యాభై మందికి పైగా మణిపూర్‌వాసులు మరణించారు.
లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. కర్ప్యూ విధించటంతోపాటు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసేదాకా పరిస్థితి వెళ్లింది. కాగా, ఉన్నత విద్యలనభ్యసించటంతోపాటు వేర్వేరు కారణాలతో మణిపూర్‌కు వెళ్లిన వందల మంది తెలంగాణ విద్యార్థులు, పౌరులు అక్కడ చిక్కుకుపోయారు. వీరితోపాటు పొరుగు రాష్ర్టమైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కూడా మణిపూర్‌నుంచి బయటకు రాలేక అక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
తమను రక్షించి తీసుకెళ్లాలని తెలంగాణ విద్యార్థులు, పౌరులు చేసిన విజ్ఞప్తితో తెలంగాణ ప్రభుత్వం వెంటనే చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మణిపూర్ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడారు. అదే సమయంలో డీజీఈ అంజనీ కుమార్మణిపూర్డీజీపీతో మాట్లాడారు. తెలంగాణకు చెందిన అందరికి రక్షణ కల్పించాలని కోరారు. దాంతోపాటు చిక్కుకుపోయిన వారిని ఇక్కడికి తీసుకు వచ్చేందుకు ఆదివారం ఓ ప్రత్యేక విమానాన్ని మణిపూర్ కు పంపించారు. ఈ విమానం తెలంగాణ విద్యార్థులు, పౌరులతో ఆదివారం రాత్రి 11గంటలకు ఇక్కడికి బయల్దేరనున్నట్టు సమాచారం. కాగా, ఆంధ్రకు చెందిన వారిని కూడా ఇక్కడికి తీసుకు వస్తున్నట్టు తెలిసింది.