మణిపూర్ ఘటనపై స్పందించిన Smita Sabharwal
మహిళలపై జరిగే అఘాయిత్యాలపై, తాజా పరిణామాలపై స్పందించే స్మితా సబర్వాల్ తాజాగా మణిపూర్ హింసాకాండపై రియాక్ట్ అయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: మహిళలపై జరిగే అఘాయిత్యాలపై, తాజా పరిణామాలపై స్పందించే స్మితా సబర్వాల్ తాజాగా మణిపూర్ హింసాకాండపై రియాక్ట్ అయ్యారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నం ఊరేగించిన ఘటనపై తెలంగాణ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మహిళలు చరిత్రలో ఎలాంటి కలహాలు జరిగినా నిస్సహాయ స్థితిలో నిలుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ లో 70 రోజుల నుంచి కొనసాగుతున్న హింసాకాండ 50 వేల మంది ముందు నగ్నంగా నిలబెట్టే వరకు వెళ్లిందన్నారు. ఇది మన మూలాలను కదిలిస్తుందన్నారు. ఇంత జరుగుతుంటే మీడియా ఏం చేస్తుందని ఫైర్ అయ్యారు. మణిపూర్ ను ఎందుకు అలా వదిలేస్తున్నారన్నారు. తన ట్వీట్‌ను రాష్ట్ర పతికి ట్యాగ్ చేశారు. రాజ్యాంగపరమైన అధికారాలు వెంటనే అమలు చేయాలని కోరారు. నైతికత లేని మెజారిటీ ప్రజల మనోభావాలు మన నాగరికతను ప్రమాదంలోకి నెడుతున్నాయన్నారు.