భద్రాద్రి ఏజెన్సీ జలమయం.. నీటమునిగిన పర్ణశాల సీతమ్మ వారి నార చీరల ప్రదేశం

భారీ వర్షాల కారణంగా భద్రాచలం ఏజెన్సీ జలమయం అయింది. భద్రాచలం నుంచి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరుకోవడంతో రాకపోకలు స్తంభించాయి.

Update: 2024-09-01 07:42 GMT

దిశ, భద్రాచలం : భారీ వర్షాల కారణంగా భద్రాచలం ఏజెన్సీ జలమయం అయింది. భద్రాచలం నుంచి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరుకోవడంతో రాకపోకలు స్తంభించాయి. భద్రాచలంలోని పలు కాలనీలను వరద ముంచెత్తింది. తాలిపేరు ప్రాజెక్టుకు 42,850 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో, 25 గేట్లు ఎత్తి 43,390 క్యూసెక్కుల నీటిని దిగువనున్న గోదావరిలోకి వదిలారు. గోదావరి ఉపనదులైన ఇంద్రావతి, ప్రాణహిత ఉప్పొంగడం, పలు ప్రాజెక్టులు, చెరువులు నిండి వరద నీరు భారీగా వచ్చి చేరడంతో భద్రాద్రి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. భద్రాచలం వద్ద గోదావరి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు 31.9 అడుగుల మేర ప్రవహిస్తుంది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రామాలయం పరిసర ప్రాంతాలు ముంపునకు గురి కావడంతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఉదయం ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అలాగే గోదావరి ఉధృతిని పరిశీలించి వరద సహాయక చర్యల కోసం అధికారులను అప్రమత్తం చేశారు.

 


Similar News