Justice AmarNath Goud : జస్టిస్‌ అమర్‌నాథ్‌ గౌడ్‌కు అరుదైన పురస్కారం

త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌(Justice AmarNath Goud) అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు.

Update: 2024-11-16 11:54 GMT

దిశ, వెబ్ డెస్క్ : త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌(Justice AmarNath Goud) అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు. అత్యధిక కేసులు పరిష్కరించిన న్యాయమూర్తిగా ఆయన రికార్డ్ సృష్టించారు. ఇందుకు గాను ఆయన తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్(Telangana Governor JishnuDev Varma) వర్మ చేతుల మీదుగా అరుదైన పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే యూకే వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్(UK Wonder Book Of Records) లో చోటు దక్కించుకున్నారు. 2017 నుంచి ఇప్పటి వరకు జస్టిస్ అమర్‌నాథ్‌ దాదాపు 92 వేల కేసులు పరిష్కరించారు. హైదరాబాద్ వాసి అయిన అమర్‌నాథ్‌ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే 2017లో తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తిగా నియామితులు అయ్యారు. ప్రస్తుతం త్రిపుర హైకోర్ట్ న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ.. తన బెంచ్ లో కేసులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని పేర్కొన్నారు.

Tags:    

Similar News