Singareni Elections : ముగిసిన సింగరేణి ఎన్నికల పోలింగ్

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ముగిసింది.

Update: 2023-12-27 12:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: సింగ‌రేణిలో గుర్తింపు సంఘం కోసం బుధ‌వారం నిర్వ‌హించిన ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా జ‌రిగాయి. ఎక్క‌డా ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలీసులు గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నిక‌ల్లో 94.15 శాతం ఓట్లు పోల‌య్యాయి. సింగ‌రేణి వ్యాప్తంగా 39,773 మంది కార్మికులు ఉండ‌గా, 37,447 కార్మికులు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

బెల్లంప‌ల్లి ఏరియాలో 96.29 శాతం, మంద‌మ‌ర్రిలో 93.38 శాతం, శ్రీ‌రాంపూర్‌లో 93.03 శాతం, కార్పొరేట్‌లో 96.14 శాతం, కొత్త‌గూడెంలో 94.88 శాతం, ఎల్లందులో 98.37 శాతం, మ‌ణుగూరులో 97.06 శాతం, ఆర్జీ 1 లో 93.68 శాతం, ఆర్జీ 2 లో 94.74 శాతం, ఆర్జీ 3లో 93 శాతం, భూపాల‌ప‌ల్లిలో 94.70 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

కాసేప‌ట్లో కౌంటింగ్ ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. పోలింగ్ ముగియ‌గానే అధికారులు బ్యాలెట్ బాక్సుల‌ను కౌంటింగ్ కేంద్రాల‌కు త‌ర‌లించారు. ఏడు గంట‌ల నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. మొద‌ట‌గా బ్యాలెట్ ప‌త్రాల‌ను క‌ట్ట‌ల‌ను క‌డుతున్న అధికారులు వాటి లెక్కింపు ప్ర‌క్రియ ప్రారంభించ‌నున్నారు.


Similar News