Minister Ponguleti:పెద్దవాగు ఘటనపై అధికారులకు షోకాజ్ నోటీసులు..మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

అధికారుల నిర్లక్ష్యంతోనే పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నేడు(సోమవారం) ఆయన ప్రాజెక్టును సందర్శించారు.

Update: 2024-07-22 11:25 GMT

దిశ,వెబ్‌డెస్క్: అధికారుల నిర్లక్ష్యంతోనే పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నేడు(సోమవారం) ఆయన ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడారు. సరైన సమయానికి గేట్లు ఎత్తి ఉంటే ఇంతటి ప్రమాదం జరిగేది కాదన్నారు. ఇరిగేషన్ శాఖ కింది స్థాయి ఉద్యోగుల తప్పిదాలతో పెద్దవాగు ప్రాజెక్టు కాపాడుకోలేక పోయమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి వరదల్లో చిక్కుకున్న వారిని 41 మందిని రక్షించుకోగలిగామన్నారు. ప్రజా ప్రభుత్వంలో వరద బాధితులను ఆదుకునేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 400 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు గుర్తించామన్నారు. ఇసుక మేటలు వేసిన పొలాలకు రూ. 10 వేలు నష్టపరిహారం ఇస్తామన్నారు. నష్టానికి బాధ్యులైన అధికారులకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చామని, విచారణలో తప్పు తేలితే వారు శిక్షార్హులు అవుతారన్నారు. సోమవారం ఉదయం ముఖ్యమంత్రితో మాట్లాడి తక్షణ మరమ్మతులకు రూ.8 కోట్లు మంజూరు చేశామని తెలిపారు.

Tags:    

Similar News