ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అవుతారా..? తెలంగాణ ఇంటెన్షన్స్ లేటేస్ట్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఇటీవల నోటీసులు పంపడం వెనక బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అండర్‌స్టాండింగ్‌లో భాగమేనన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఇటీవల నోటీసులు పంపడం వెనక బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అండర్‌స్టాండింగ్‌లో భాగమేనన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతున్నది. ఈ అంశాన్ని బీఆర్ఎస్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సెంటిమెంట్ అస్త్రంగా వాడుకునే ఆలోచన కూడా ఉన్నట్లు తేలింది. ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని కూడా ప్రజల్లో ఒక క్లారిటీ ఏర్పడింది.
అసెంబ్లీ ఎన్నికల్లో కవితకు ఈడీ ఇచ్చిన నోటీసులు, అరెస్టు ప్రభావం కూడా ఉంటుందని తేలింది. ప్రతిపక్షాలను బీజేపీ రాజకీయంగా వేధించడానికే ఈడీ నోటీసులు అని కూడా కొద్దిమందిలో అభిప్రాయం నెలకొన్నది. వీటన్నింటి నేపథ్యంలో గత వారం రోజులుగా ప్రజల నాడిని పసిగట్టిన తెలంగాణ ఇంటెన్షన్స్ మూడు వేల మంది నుంచి రాబట్టిన అభిప్రాయాలను ఆదివారం ఉదయం వెల్లడించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో కవిత ఈడీ నోటీసుల వ్యవహారం ప్రభావం ఉండొచ్చని 47% మంది అభిప్రాయపడ్డారని ఆ సర్వే వెల్లడించింది. పెద్దగా ప్రభావం చూపదని 32% మంది వ్యాఖ్యానించారు. గత వారం రోజులతో పోలిస్తే ప్రజల అభిప్రాయంలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాత్రమే ఉంటుందని బలపడుతున్నది. బీజేపీని ప్రజలు సీరియస్ పోటీ ఇస్తుందనే నమ్మకాన్ని కోల్పోతున్నారు. బీజేపీకి విజయావకాశాలు లేవనే నిర్ధారణకు వచ్చి మిగిలిన రెండు ప్రధాన పార్టీలవైపు చూస్తున్నట్లు తేలింది. తాజా సర్వేను సెప్టెంబరు 10-16 తేదీల మధ్య రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించినట్లు ఆ సంస్థ పేర్కొన్నది. అందులో తేలిన కొన్ని అంశాలు :
= బీఆర్ఎస్, బీజేపీ మధ్య బంధం కారణంగా కవితను ఈడీ అరెస్టు చేయదు – 21% మంది
= ప్రజల దృష్టిని మళ్ళించడానికి బీజేపీ, బీఆర్ఎస్ కలిపి చేస్తున్న ప్రయత్నం – 13% మంది
= కవితకు ఈడీ నోటీసు, అరెస్టు (అయినట్లయితే) బీఆర్ఎస్ దీన్ని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సెంటిమెంట్‌గా వాడుకుంటుంది – 11% మంది
= కవితను ఈడీ (బీజేపీ) త్వరలో అరెస్టు చేస్తుంది – 18% మంది
= బీఆర్ఎస్‌ను బెదిరించడానికే లిక్కర్ కేసును మళ్లీ కదిలించింది – 28% మంది
= పోలింగ్‌పై కవిత ఎపిసోడ్ ప్రభావం చూపిస్తుంది – 47% మంది