రివర్సైన వ్యవహారం.. చిక్కుల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి!
టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో పరిణామాలు కీలక మలుపు దిశగా కొనసాగుతున్నాయి. ఇవాళ సిట్ విచారణకు వెళ్లిన రేవంత్ రెడ్డి అధికారులకు తన ఆరోపణలపై ఆధారాలు సమర్పించానని చెప్పారు.
దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో పరిణామాలు కీలక మలుపు దిశగా కొనసాగుతున్నాయి. ఇవాళ సిట్ విచారణకు వెళ్లిన రేవంత్ రెడ్డి అధికారులకు తన ఆరోపణలపై ఆధారాలు సమర్పించానని చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సిట్ ఖండించింది. తాను చేసిన ఆరోపణలపై రేవంత్ రెడ్డి ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని సిట్ పేర్కొంది. కేవలం పొలిటికల్ మోటీవ్గా మాత్రమే ఆయన సిట్ దర్యాప్తుకు వచ్చారని చెప్పింది.
ఈ కేసులో ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారని రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని ఈ మేరకు ఆయనపై కేసు నమోదుపై న్యాయ సలహాను సిట్ కోరినట్లు తెలుస్తోంది. లీగల్ ఒపీనియన్ ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో టీఎస్ పీఎస్సీ ప్రశ్న పత్రాల లీక్ కేసు దర్యాప్తు ఉత్కంఠ రేపుతోంది.