కేసీఆర్‌పై YS Sharmila సంచలన వ్యాఖ్యలు..

సీఎం కేసీఆర్, రాష్ట్రంలోని ఎమ్మెల్యేలపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-11-28 08:05 GMT

దిశ, చెన్నరావుపేట: సీఎం కేసీఆర్, రాష్ట్రంలోని ఎమ్మెల్యేలపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ 420 అని అదే బాటలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పయనిస్తున్నారన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దత్తత తీసుకున్నాడట కదా ఇదేనా దత్తత గ్రామంలో అభివృద్ధి అని వై.ఎస్ షర్మిల మండిపడ్డారు. టీఆర్ఎస్‌లో ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ అవినీతికి మారుపేరుగా మారారని ఆమె ఆరోపించారు. వై.ఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్రలో భాగంగా చెన్నారావుపేటలో ఆమె పర్యటించారు. ఆదివారం ఎమ్మెల్యేపై విరుచుకుపడిన షర్మిల సోమవారం కూడా పెద్దిని టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిలో పెద్దిది చిన్నబుద్ది అని, భూదందాలో పెద్ద బుద్ది అని విమర్శించారు. ఎమ్మెల్యే‌కి నియోజక వర్గ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టాలని కోరారు. చెన్నరావుపేట ప్రధాన రహదారి చూస్తుంటేనే పెద్ది పని తీరు కనపడుతుందన్నారు. వై.ఎస్.ఆర్ వేసిన రోడ్లే ఇప్పటికీ ప్రజలకి దిక్కుగా మారాయన్నారు. త్రాగునీరు లేక ప్రజలు నాన అవస్థ పడుతున్నారని, మంచినీరు ఇవ్వని దిక్కుమాలిన ఎమ్మెల్యే ఎందుకని ప్రశ్నించారు. రాళ్ల వానతో 20 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగితే ఒక్క రైతుని ఆదుకున్నాడా అని ప్రజలను అడిగారు.

15 రోజుల్లో పరిహారం అని మొహం చాటేసిన ఎమ్మెల్యే ఏ మొహంతో మళ్లీ ఓట్లడుగుతాడని ఎద్దేవా చేశారు. నర్సంపేటలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ మోసపూరిత వాగ్ధానాలు చేసి మాట తప్పారన్నారు. కేసీఆర్ 420 అని అదే బాటని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుసరిస్తున్నారన్నారు. చెన్నరావుపేట బ్రిడ్జి నిర్మాణ హామీ తుంగలో తొక్కారని, నియోజక వర్గంలో అవినీతి, భూదందాలు తప్ప అభివృద్ధి లేదన్నారు. షర్మిల పాదయాత్రలో దాడులు చేస్తారని సమాచారంతో చెన్నరావుపేట,జల్లి గ్రామాల టీఆర్ఎస్ నాయకులని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసినట్లు సమాచారం. తమ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఫ్లెక్సీలని టీఆర్ఎస్ కార్యకర్తలు దహనం చేశారు. నర్సంపేట, చెన్నరావుపేట మండలం జల్లి గ్రామంలో ఆందోళన చేపట్టారు. షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నందున ముందస్తు జాగ్రత్తగా పోలీసులు భద్రతని పెంచారు.

Read More: షర్మిల బస్సుపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలు (వీడియో)

Tags:    

Similar News