కొత్త పెన్షన్ దారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి గాంధీ భవన్‌లో పీఏసీ సమావేశం నిర్వహించారు.

Update: 2023-12-18 09:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి గాంధీ భవన్‌లో పీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశం అనంతరం మాజీ మంత్రి షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మిగతా నాలుగు గ్యారంటీల అమలుపై చర్చించామని షబ్బీర్ అలీ చెప్పారు. మహిళలకు నెలకు రూ.2500 పథకంపై ఈ నెల 28న మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రూ.4 వేల పించన్ అమలుపైనా సుదీర్ఘ చర్చలు జరిగాయని తెలిపారు.

ఈ నెల 28 నుంచి మరికొన్ని పథకాలకు దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభం అయిందని అన్నారు. రాష్ట్ర పరిస్థితి చాలా అస్తవ్యస్థంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకలపై సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టి సారించారని వెల్లడించారు. అంతేగాక, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News