న్యూ ఇయర్ వేడుకలపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

న్యూయర్ వేడుకలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేవారిని 'సమాజాన్ని

Update: 2022-12-28 13:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : న్యూయర్ వేడుకలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేవారిని 'సమాజాన్ని తప్పుదోవ పట్టించే వ్యక్తులు'గా రాజాసింగ్ అభివర్ణించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఓ వీడియోను విడుదల చేశారు.'భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ప్రతిరోజూ కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. డిసెంబర్ 31న ప్రారంభించే ఈ నూతన సంవత్సర వేడుకలు మన భారతీయ సంస్కృతి కానే కాదు. పాశ్చాత్య సంస్కృతి అని గుర్తుంచుకోండి.

200 ఏళ్ల పాటు భారతదేశాన్ని పాలించిన ఇంగ్లీషు వారి సంస్కృతి ఇది. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల సమయంలో దుష్ట శక్తులు ఆవహించినట్లు ప్రజలు వేడుకల్లోకి పిచ్చిగా మునిగిపోతారు. మన కొత్త సంవత్సరం ఉగాది నాడే ప్రారంభమవుతుంది'అని అన్నారు. జనవరి 1న ఘనంగా జరుపుకునే నూతన సంవత్సర వేడుకలను పెద్ద ఎత్తున విమర్శించిన రాజాసింగ్..ఈ పాశ్చాత్య సంస్కృతిని అంతం చేయడానికి దేశంలోని యువత చేతులు కలపాలని కోరారు. యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం మనది కాదనే విషయంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే.. పాశ్యత్య సంస్కృతికి స్వస్తి చెప్పవచ్చని రాజాసింగ్ అన్నారు. ప్రస్తుతం రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతుంది.

Tags:    

Similar News