వచ్చే ఎన్నికల్లో 80 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు: రేవంత్ రెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 111 జీవో రద్దుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

Update: 2023-05-22 11:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 111 జీవో రద్దుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంనైనా క్షమించొచ్చు గానీ.. సీఎం కేసీఆర్ ను క్షమించలేమని పేర్కొన్నారు. ఇవాళ ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్.. అనుయాయుల కోసమే 111 జీవోను ఎత్తివేశారని పేర్కొన్నారు. అప్పట్లో వరదల నివారణల కోసం, హైదరాబాద్ నగర్ ప్రజలకు తాగునీటి కోసం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ తీసుకొస్తే దాన్ని సీఎం కేసీఆర్ విధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు.

111 జీవో పరిధిలో పేదల చేతిలో 20 శాతం కూడా భూములు లేవని పేర్కొన్నారు. 111 జీవో రద్దు పరిధిలో ఎవరెవరు భూములు కొన్నారో.. వారి లెక్క తేల్చేందుకు కాంగ్రెస్ ఆధ్వర్వంలో నిజనిర్ధారణ కమిటీ వేస్తామని చెప్పారు. ఈ జీవో రద్దు అంశాన్ని సీఎం కేసీఆర్ చాలా చిన్నది చేసి చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ అనుయాయుల కోసమే జీవో రద్దు చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో 80 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని పేర్కొ్న్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లు.. వ్యాపారులు బీఆర్ఎస్ వైపు ఉంటే పేద ప్రజలు మాత్రం.. కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కోసం కోకాపేటలో స్థలం ఇవ్వడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఎక్కడెక్కడ ఎవరు భూములు కొన్నారో లెక్క తేలుస్తామన్నారు.

Also Read..

రేపు హైదరాబాద్‌కు ఏఐసీసీ మహిళా కాంగ్రెస్​చీఫ్​

Tags:    

Similar News