టీ కాంగ్రెస్‌లో సెకండ్ లిస్ట్ కలకలం.. ఖర్గేకు లేఖ రాసిన సీనియర్ నేతలు
సెకండ్ లిస్ట్ టీ కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతోంది. టికెట్ ఆశించి
దిశ, వెబ్‌డెస్క్: సెకండ్ లిస్ట్ టీ కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతోంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అసంతృప్తితో పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వేరే పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. మరికొంతమంది రెబల్స్‌గా పోటీలోకి దిగేందుకు సిద్దమవుతున్నారు. దీంతో కాంగ్రెస్‌కు రెబల్స్ బెడద పట్టుకుంది. ఈ క్రమంలో సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు రాష్ట్ర సీనియర్ నేతలు లేఖ రాశారు.
సీట్ల కేటాయింపుపై కొంతమంది సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ప్యారాచూట్ నేతలకు టికెట్లు కేటాయించారనే అభిప్రాయం నేతల్లో ఉందని ఆరోపించారు. దీంతో ఫస్ట్, సెకండ్ లిస్ట్‌లో ప్రకటించిన అభ్యర్థుల పేర్లను పున:పరిశీలించి మార్పులు చేయాలని సూచించారు. నిబద్దత, ప్రజల్లో విశ్వాసం ఉన్న నేతలకు టికెట్లు ఇవ్వాలని కోరారు. టికెట్లు దక్కని నేతలు అసంతృప్తితో ఉన్నారని, పార్టీలో ఉన్న వాతావరణాన్ని చక్కదిద్దటానికి ప్రయత్నాలు చేయాలని లేఖలో సీనియర్ నేతలు సూచించారు.