TPCC చీఫ్ రేవంత్ రెడ్డిపై దాడి సరికాదు: బీఆర్ఎస్‌పై వీహెచ్ ఫైర్
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల అవసరం లేదా..? అంటూ కాంగ్రెస్సీనియర్నేత వీ హనుమంతరావు ఫైర్అయ్యారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల అవసరం లేదా..? అంటూ కాంగ్రెస్సీనియర్నేత వీ హనుమంతరావు ఫైర్అయ్యారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్నాయకుల మీద దాడులు చేయడం సరికాదన్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని బీఆర్ఎస్నేతలు గుర్తు పెట్టుకోవాలన్నారు. భూపాలపల్లిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రపై దాడిని ఖండిస్తున్నానని చెప్పారు. కేసీఆర్ దగ్గర మెప్పు పొందడనికి గండ్ర వెంకటరమణారెడ్డి దాడి చేయించాడన్నారు.
బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల్లో మీటింగ్‌లు పెడితే కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేస్తే కేసీఆర్ ఒప్పుకుంటాడా..? అని వీహెచ్ప్రశ్నించారు. రాళ్లు రువ్వడమ్, టమాటాలు వేయడం సరైన పద్దతి కాదని హెచ్చరించారు. ఇలాంటి చర్యలు మానుకొక పోతే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య వస్తుందన్నారు. కాంగ్రెస్ఫిషరిస్చైర్మన్మెట్టు సాయికుమార్మాట్లాడుతూ.. పార్టీ మారిన గండ్ర వెంకటరమణారెడ్డిపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉన్నదన్నారు. పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యే లపై కూడా ప్రజలు బుద్ది చెబుతారన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడడం మొదలైతే బీఆర్ఎస్ తట్టుకోలేదన్నారు.