ఐయామ్ సేఫ్.. సెల్ఫీ వీడియో విడుదల చేసిన హైదరాబాద్ సీపీ (వీడియో)

తన ఆరోగ్యంపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య స్పందించారు. ఛాతిలో నొప్పి రావడంతో సీపీని అపోలో ఆసుపత్రికి తరలించారనే వార్తలు రావడంతో సందీప్ శాండిల్య ఆరోగ్యం పట్ల ఒక్కసారిగా పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.

Update: 2023-11-20 12:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తన ఆరోగ్యంపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య స్పందించారు. ఛాతిలో నొప్పి రావడంతో సీపీని అపోలో ఆసుపత్రికి తరలించారనే వార్తలు రావడంతో సందీప్ శాండిల్య ఆరోగ్యం పట్ల ఒక్కసారిగా పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కమిషనరే స్వయంగా సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఒంట్లో గిడ్డి నెస్ అనిపించడంతో అపోలో ఆసుపత్రికి వచ్చానని వైద్య పరీక్షలో బీపీ, స్పాండిలైటీస్ వల్ల అలా జరిగిందని తెలిసిందన్నారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని మరి కొద్ది గంటలు వైద్యుల పర్వవేక్షణలో ఉండి రేపు తిరిగి యథావిధిగా విధులకు హాజరవుతానని వెల్లడించారు. తన హెల్త్ విషయంలో జరుగుతున్న రూమర్స్‌ను నమ్మవద్దని చెప్పారు. వీడియో  కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి: https://youtube.com/shorts/omjLvE3swoQ


Tags:    

Similar News