Seethakka : స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు.. IAS ఆఫీసర్‌కు మంత్రి సీతక్క స్వీట్ వార్నింగ్

ఐఏఎస్ సర్వీసుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకని స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-07-23 05:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐఏఎస్ సర్వీసుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకని స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై తాజాగా మంత్రి సీతక్క స్పందించారు. ఒక అధికారిగా ఫిజికల్ ఫిట్‌నెస్ గురించి స్మితా సబర్వాల్ స్పందించడం తప్పు అన్నారు. ఫీల్డ్ విజిట్ చేసే ఉద్యోగానికి, ఆఫీస్‌లో చేసే ఉద్యోగానికి తేడా తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.

స్మితా సబర్వాల్ వాఖ్యలు సీఎం దృష్టికి ఇప్పటికే వెళ్లి ఉంటాయని.. తాను కూడా సీఎం తో ఈ అంశమై మాట్లాడుతా అన్నారు. ఫిజికల్ ఫిట్ నెస్ అనేది దేవుడు ఇచ్చేది అని సీతక్క అభిప్రాయపడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల పని వేరు అన్నారు. అనాధిగా ఒక మనస్తత్వం ఉన్న వారికి ఇలాంటి ఆలోచనలు వస్తాయన్నారు. ఇప్పటికైనా అలాంటి ఆలోచనలు మానుకోవాలని సూచించారు. అంగవైకల్యంతో ఎంతోమంది గొప్ప స్థానాలకు వెళ్లారని.. ఇతరుల సమర్థతను గుర్తించాలన్నారు. ఇలాంటి వైకల్యం గురించి ఆలోచించే వారికే మానసిక వైకల్యం ఉంటుందన్నారు..

Tags:    

Similar News