ఖమ్మం అభివృద్ధి చూసి నేను సిద్దిపేటలో అభివృద్ధి చేస్తున్న: Minsiter Harish Rao
తెలంగాణ రాష్ట్ర అర్ధిక మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ నెల 18 న ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్ట మొదటి సారి ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ రాష్ట్ర అర్ధిక మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ నెల 18 న ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్ట మొదటి సారి ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. అభివృధ్దిలో ఖమ్మం ఆదర్శంగా నిలిచిందని.. ఇక్కడ చూసే తాను సిద్దిపేటను అభివృద్ధి చేసుకుంటున్నాని అన్నారు. ఒకప్పటి ఖమ్మం.. ఇప్పుడు లేదని.. అప్పట్లో తాను చూసిన ఖమ్మం వేరే.. ఇప్పుడున్న ఖమ్మం వేరే అని మంత్రి హరీశ్ రావు.. మంత్రి పువ్వాడ అజయ్ పై ప్రసంశలు కురిపించారు. అలాగే తెలంగాణలో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు.