రేవంత్ రెడ్డి నివాసం వద్ద భద్రత పెంపు
కాంగ్రెస్‌శాసనసభా పక్ష నాయకునిగా ఎంపికైన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్జూబ్లీహిల్స్సీబీఐ కాలనీలోని ఆయన నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌శాసనసభా పక్ష నాయకునిగా ఎంపికైన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్జూబ్లీహిల్స్సీబీఐ కాలనీలోని ఆయన నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రొటోకాల్ప్రకారం రేవంత్‌రెడ్డి వద్ద పూర్తి స్థాయి సెక్యూరిటీని కల్పించనున్నారు. హ్యాట్రిక్సాధించాలన్న బీఆర్ఎస్ఆశలకు గండి కొడుతూ కాంగ్రెస్అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ప్రచారం జరుగుతూ వస్తోంది. మంగళవారం అదే నిజమైంది.
కాంగ్రెస్అధిష్టానం రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌శాసనసభా పక్ష నాయకునిగా ఎంపిక చేసింది. కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద భద్రతను పెంచారు. 15 మంది కానిస్టేబుళ్లను ఆయన నివాసం వద్ద మోహరించారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద మంగళవారం పెద్దగా హడావిడి కనిపించలేదు. అయితే, రేవంత్‌రెడ్డి హైదరాబాద్చేరుకున్న తరువాత పెద్ద సంఖ్యలో కాంగ్రెస్నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటి వద్దకు చేరుకోవటం ఖాయమని చెబుతున్న పోలీసు ఉన్నతాధికారులు దానిని దృష్టిలో పెట్టుకునే సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గాంధీభవన్‌లో కూడా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తామని తెలిపారు.