రెండో రోజూ ఓయూలో టెన్షన్.. లీకేజీకి వ్యతిరేకంగా నిరసనలు

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై రెండో రోజైన శనివారం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఆర్ట్స్ కాలేజీ నుంచి విద్యార్థులు

Update: 2023-03-25 07:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై రెండో రోజైన శనివారం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఆర్ట్స్ కాలేజీ నుంచి విద్యార్థులు ర్యాలీ ప్రయత్నం చేశారు. దీంతో వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీఎస్ పీఎస్సీ కమిషన్ ను బర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా విద్యార్థులు డిమాండ్ చేశారు. మరో వైపు ఓయూలో విద్యార్థులకు మద్దతుగా నిలిచిన పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ను గృహనిర్బంధం చేశారు. టీపీసీసీ చీఫ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లే దారులన్నీ మూసివేశారు.

Tags:    

Similar News