Search Name in Voter List: మీ ఊరిలో మీ ఓటు ఉందో లేదో చెక్‌ చేసుకున్నారా?

మొబైల్ లోనే సింపుల్ గా వార్డుల వారీగా ఓటర్ జాబితాను ఇలా పొందవచ్చు.

Update: 2024-09-16 06:10 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయి. నోటిఫికేషన్ వెలువడగానే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికల ముసాయిదా ఓటర్ జాబితాను స్టేట్ ఎలక్షన్ కమిషన్ అధికారులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్, మండల రెవెన్యూ కార్యాలయాల ఎదుట ముసాయిదాను అందుబాటులో ఉంచారు. అయితే అక్కడి వెళ్లకుండానే మీ గ్రామంలో మీ ఓటు ఉందో లేదో ఆన్ లైన్ లో సింపుల్ గా తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. దీని కోసం ముందుగా తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ https://tsec.gov.in ను ఓపెన్ చేయాలి. ఇక్కడ టీఎస్ఈసీ వెబ్ సైట్ ఆప్షన్ తో పాటు డ్రాప్ట్ రోల్ జీపీ/వార్డ్ వైజ్ వోటర్ లిస్ట్ అనే మరో ఆప్షన్ కనిపిస్తుంది. రెండో ఆప్షన్ ను ఎంచుకుని అక్కడ మీ జిల్లా, మండలం గ్రామ పంచాయతీ వివరాలను నమోదు చేస్తే మీ గ్రామానికి సంబంధించిన ఓటర్ లిస్ట్ వార్డుల వారీగా కనిపిస్తుంది. ఈ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 21వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఈ నెల 28న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు. తుది జాబితా ఆధారంగానే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలను నిర్వహించబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఎలక్షన్ సీజన్ లో మీ గ్రామంలో మీ ఓటు హక్కు ఉందో లేదో ఓసారి చెక్ చేసుకోండి.


Similar News