స్కూల్ బస్సు ప్రమాద ఘటనపై Minister KTR ఆరా
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు.
దిశ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో ఫోన్లో మాట్లాడారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యను పూర్తి సమాచారం అడిగి తెలుసుకున్నారు. గాయపడిన విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని, అవసరమయితే హైదరాబాద్కి తరలించాలని సూచించారు.
Also Read...
పోలీసుల నోటీసులు.. Rajasingh సంచలన వ్యాఖ్యలు!
మంత్రి కేటీఆర్ కరీంనగర్ పర్యటనలో ఉద్రిక్తత.. కన్వాయ్కి అడ్డుపడ్డ ఏబీవీపీ నాయకులు