SC Railways: మహబూబాబాద్ వద్ద రెండు భాగాలుగా విడిపోయిన గూడ్స్ రైలు

డోర్నకల్ రైల్వే స్టేషన్(Dornakal Railway Station) నుంచి కాజీపేట(Kajipeta)కు వెళ్తున్న గూడ్స్ రైలు(Goods Train) లింక్ తెగిపోయి రెండు భాగాలుగా విడిపోయింది.

Update: 2024-12-03 06:57 GMT

దిశ, వెబ్ డెస్క్: డోర్నకల్ రైల్వే స్టేషన్(Dornakal Railway Station) నుంచి కాజీపేట(Kajipeta)కు వెళ్తున్న గూడ్స్ రైలు(Goods Train) లింక్ తెగిపోయి రెండు భాగాలుగా విడిపోయింది. ఈ ఘటన ఇవాళ ఉదయం మహబూబాబాద్ రైల్వే స్టేషన్(Mahaboobabad Railway Station) సమీపంలోని 436/12 కిలోమీటర్ రాయి వద్ద జరిగింది. గూడ్స్ రైలు ప్రయాణిస్తున్న సమయంలో అకాస్మత్తుగా పెట్టెల మధ్యలో లింక్ తెగి రైలు ఇంజన్ నుంచి కొన్ని పెట్టలు దూరమయ్యాయి. దీనిని గుర్తించిన గూడ్స్ గార్డ్(Goods Gaurd).. లోకో పైలట్(Loco Pilot) ను అప్రమత్తం చేశాడు. దీంతో లోకో పైలట్ రైలును ఆపివేశాడు. అనంతరం ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. దీంతో రైల్వే అధికారులు ఆ మార్గంలో తదుపరి వచ్చే రైళ్ల రాకను నిలిపివేశారు. దీంతో ప్రమాదం తప్పినట్టు అయ్యింది. తర్వాత రైల్వే ఉన్నతాధికారులు(Railway Officials), సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. ఘటనపై ఆరా తీసిన రైల్వే అధికారులు విచారణ చేపడతామని వెల్లడించారు. 

Tags:    

Similar News