CM రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే అంతు చూస్తా.. BRS నేతలకు ప్రీతమ్ స్ట్రాంగ్ వార్నింగ్

సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే అంతు చూస్తానని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ హెచ్చరించారు.

Update: 2024-07-10 17:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే అంతు చూస్తానని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ హెచ్చరించారు. ఆయా వ్యక్తులపై 33 జిల్లాల్లో కేసులు పెట్టిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పదవిని పక్కన పెట్టి మరి వాళ్ల భరతం పడతానని వెల్లడించారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. ప్రస్తుతం ధర్నాలు చేసి, అరెస్ట్ అయినోళ్లు ఎవ్వరూ ఉద్యోగాల కోసం అప్లై చేయలేదన్నారు. త్వరలో డేటా అంతా బయటకు తీస్తామన్నారు. కేటీఆర్ పెయిడ్ బ్యాచ్‌తో ధర్నాలు చేపించి ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారన్నారు. గాదరి కిషోర్, బాల్క సుమన్‌లు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్నారు. దళిత నాయకులను ముందు పెట్టి పబ్బం గడపాలని కేసీఆర్ చూస్తుండన్నారు.

అందరూ పంది కొక్కుల్లాగా కాంగ్రెస్‌ దాడి చేస్తున్నారన్నారు. పది ఏండ్లు గాజులు తొడుక్కొని, చీరలు కట్టుకొని ఉన్నారా..? అంటూ గాదరి కిషోర్, బాల్క సుమన్‌లపై ఫైర్ అయ్యారు. ఎంగిలి మెతుకులు, బిస్కెట్ల కోసం గాదరి కిషోర్ మాట్లాడుతున్నాడన్నారు. పీసీసీ స్పోక్స్ పర్సన్ దయాకర్ మాట్లాడుతూ.. శవ రాజకీయాలు చేయడం బీఆర్ఎస్‌కు అలవాటుగా మారిందన్నారు. ప్రశాంతంగా ఉన్న ఉస్మానియాలో చిచ్చు పెట్టి డిస్టర్బ్ చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి చారగొండ వెంకటేష్ మాట్లాడుతూ.. హరీష్ రావు, బాల్క సుమన్‌లు తనను చంపుతారని భయపడి మోతిలాల్ నాయక్ దీక్ష విరమించాడన్నారు. దీక్ష పేరుతో మోతిలాల్‌ను చంపాలని చూశారని ఆరోపించారు.


Similar News