సెప్టెంబర్ నెలలో మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. సోషల్ మీడియాలో వైరల్

గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీ కాలం ఫిబ్రవరి 2న ముగిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన ప్రవేశ పెట్టింది. నాటి నుంచి నేటి వరకు గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది.

Update: 2024-08-03 12:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీ కాలం ఫిబ్రవరి 2న ముగిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన ప్రవేశ పెట్టింది. నాటి నుంచి నేటి వరకు గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. అయితే సర్పంచ్ ఎన్నికలు ఇప్పటికే నిర్వహించాల్సి ఉండగా ప్రభుత్వం దాన్ని పోస్ట్ ఫోన్ చేస్తూ వస్తుంది. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం రుణమాఫీ అనంతరం గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రెండు విడతల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. అలాగే ఆగస్టు నెల చివరి వరకు మూడో విడత రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం హామి ఇచ్చింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు పలుమార్లు సర్పంచ్ ఎన్నికలపై సమావేశం అయ్యారు. ఇదిలా ఉంటే.. రెండు రోజులుగా సోషల్ మీడియాలో సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయిందని.. సెప్టెంబర్ 21, 25, 30 తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయని, కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచులు అక్టోబర్ 1వ లేదా 2వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారనే వార్త సోషల్ మీడియా షేక్ చేస్తుంది. కాగా దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి క్లారిటీ రాలేదు.

Tags:    

Similar News