మరోసారి రెచ్చిపోయిన వీధి కుక్కలు.. పారిశుధ్య కార్మికురాలికి తీవ్ర గాయాలు

మల్కాజిగిరిలో మరోసారి వీధి కుక్కలు రెచ్చిపోయాయి. శనివారం గిరికృపా కాంప్లెక్స్‌ వద్ద విధులు నిర్వహిస్తోన్న పారిశుధ్య కార్మికురాలపై దాడికి పాల్పడ్డాయి.

Update: 2024-07-27 12:29 GMT

దిశ, వెబ్‌డెస్క్‌: మల్కాజిగిరిలో మరోసారి వీధి కుక్కలు రెచ్చిపోయాయి. శనివారం గిరికృపా కాంప్లెక్స్‌ వద్ద విధులు నిర్వహిస్తోన్న పారిశుధ్య కార్మికురాలపై దాడికి పాల్పడ్డాయి. తీవ్ర గాయాలు కావడంతో గమనించిన మున్సిపల్ సిబ్బంది ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఇటీవలే వీధి బెడదను అరికట్టాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కుక్కలు దాడి చేస్తే.. జీహెచ్‌‌ఎంసీ పరిధిలోని అన్ని అర్బన్ సెంటర్లు, రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో వెంటనే వైద్యం అందించేందుకు అవసరమైన మందులు, టీకాలు అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్య శాఖను సీఎం ఆదేశించారు. మరోసారి వీధి కుక్కల దాడి కారణంగా ఏ చిన్నారి చనిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Tags:    

Similar News