'Pushpa 2' Stampede: సినిమా రంగంలో మార్పు రావాలి.. శ్రీతేజను పరామర్శించిన సీపీఐ నేతలు
సినిమా రంగంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అభిప్రాయం పడ్డారు.
దిశ, డైనమిక్ బ్యూరో: సినిమా రంగంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (CPI Kunamneni Sambasiva Rao) అభిప్రాయం పడ్డారు. (Pushpa 2 Stampede) పుష్ప -2 సినిమా తొక్కిసలాట ఘటనలో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న (Sri Teja) శ్రీతేజను మంగళవారం సీపీఐ నేతలు పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కూనంనేని మాట్లాడుతూ.. ఈ అంశంపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు. సినిమాలల్లో విలన్లను హీరోలుగా చిత్రీకరించే పద్ధతి మార్పు రావాలన్నారు. సామాజిక, సందేశాత్మక చిత్రాలకు సెన్సార్ బోర్డు అనుమతులు ఇవ్వొద్దన్నారు. పోలీసు వ్యవస్థను అణచివేసే విధంగా రౌడీయిజాన్ని ప్రోత్సహించే సినిమాలకు అనుమతులు ఇవ్వడం శోచనీయమని చెప్పారు.