సనాతన సాహిత్యం.. గోండు భాషలో భారతం.. మాజీ ఉపరాష్ట్రపతి ఆసక్తికర ట్వీట్

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. మహాభారతాన్ని గోండు భాషలోకి అనువదించి "పండోక్న మహాభారత్ కథ" పేరిట పుస్తకంగా తీసుకొచ్చిన తొడసం కైలాస్...

Update: 2024-07-16 14:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. మహాభారతాన్ని గోండు భాషలోకి అనువదించి "పండోక్న మహాభారత్ కథ" పేరిట పుస్తకంగా తీసుకొచ్చిన తొడసం కైలాస్, మంగళవారం హైదరాబాద్ లోని తన నివాసానికి వచ్చి, పుస్తకాన్ని అందజేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించానని తెలిపారు. భవిష్యత్తులో భారతీయ సనాతన సాహిత్యం విషయంలో ఈ ప్రయత్నం కొనసాగించాలని సూచించానని తెలిపారు.

ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న కైలాస్, గిరిజనులకు మహాభారతాన్ని చేరువ చేసేందుకు గోండు భాషలో రచించి చేసిన ప్రయత్నం అభినందనీయమైనదని పేర్కొన్నారు. ఏ విషయమైనా మాతృభాషలో తెలుసుకుంటే అది మనసుకు హత్తుకుంటుందని వివరించారు. ఈ చొరవ ద్వారా భవిష్యత్ తరాలకు మహాభారతం మరింత చేరువ కావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.


Similar News