Sama Ram Mohan : గుమాస్తా పత్రిక! బిగ్ బ్రదర్స్ కథనం వెనుక కుట్ర.. సామ రామ్మోహన్ రెడ్డి
సమాజంలో ఏ అన్యాయం జరిగిన ప్రజల పక్షాన గళం విప్పింది మీడియా అని, కొందరు మాత్రం మీడియా ఖ్యాతిని తగ్గించే విధంగా చేస్తున్నారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు.
దిశ, డైనమిక్ బ్యూరో: సమాజంలో ఏ అన్యాయం జరిగిన ప్రజల పక్షాన గళం విప్పింది మీడియా అని, కొందరు మాత్రం మీడియా ఖ్యాతిని తగ్గించే విధంగా చేస్తున్నారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఆదివారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. నమస్తే తెలంగాణ నుంచి తెలంగాణ పదం తొలగిస్తే బాగుంటుందన్నారు. అది గుమాస్తా కరపత్రమని విమర్శించారు. నమస్తే తెలంగాణలో బిగ్ బ్రదర్స్ కథనం వెనుక కుట్ర కోణం ఉందన్నారు. నాదర్ గుల్‌లో 290 ఎకరాలపై కన్ను.. లావణి పట్టా భూములకు ఎసరు అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
అసైన్డ్ భూములు అమ్ముకునే హక్కు ఎవరికీ ఉండదన్నారు. దానిమీద అక్టోబర్ 31 తేదీనే ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యిందన్నారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ అవ్వలేదు అని అబద్దాలతో ‘నమస్తే తెలంగాణ’ నేడు ఫ్రంట్ పేజీలో ప్రచురించటం తమ దిగజారుడు తనాన్ని చూపుతుందని విమర్శించారు. రైతులే నమస్తే తెలంగాణ పత్రిక మీద కేసు పెట్టారని, ఈ తప్పుడు కథనాల వెనుక సూత్రధారులు ఎవ్వరూ ఉన్న వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
పోలీసులను కీలుబొమ్మ అంటే.. ప్రజలు మీ కీళ్లు విరగ్గోడతారని మండిపడ్డారు. ఎఫ్ఐఆర్ చేసింది పోలీసులు కాదా? అని ప్రశ్నించారు. మీరు ఆరోపించిన ప్రవీణ్ రెడ్డి పేరు మీద కూడా ఎఫ్ఐఆర్ అయ్యిందన్నారు. ప్రభుత్వం మీద బురద జల్లే కుట్ర ప్రయత్నం ఇదని, అన్యాయం జరిగితే ఎదురించండని, నిజాలు రాస్తే స్వాగతిస్తామన్నారు.