అవన్నీ కాంగ్రెస్‌ నిర్మించిందని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది: రామ్మోహన్ రెడ్డి

పదేళ్ల బీజేపీ పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదని తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు.

Update: 2024-04-12 08:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్ల బీజేపీ పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదని తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పదేళ్లలో దేశంలో ఎలాంటి మార్పు జరుగలేదని అన్ని సర్వేలు చెబుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకు రేషన్ కార్డులు ఇచ్చిందన్నారు. బీజేపీ ఇప్పటి వరకు ఒక్క రేషన్ కార్డు పెంచలేదని, వృద్ధులకు, వితంతవులకు ఒక్క పైసా కూడా పెన్షన్ పెంచలేదని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ధరలను నియంత్రిస్తామని, అవినీతిని నిర్మూలిస్తామని అన్నారు. నల్లధనాన్ని బీజేపీ వారే దోచుకున్నారన్నారు.

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్నారు. కానీ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని పేర్కొన్నారు. బీజేపీకి ఇంకా మేనిఫెస్టోనే లేదని, కాంగ్రెస్ మేనిఫెస్టోని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోకు ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందన్నారు. బీజేపీవి అన్ని లంగా మాటలని, బీజేపీ కుట్రలన్నీ తేట తెల్లమ్ చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పొందు పరిచిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ తీసుకెళ్లిపోతే బీజేపీ నాయకులు ఒక్కరు కూడా మాట్లాడలేదన్నారు. ఎయిమ్స్ లో 750 పడకలు ఉండాలి, కానీ 135 మాత్రమే ఉన్నాయని, బీజేపీ తెలంగాణకు ఏమి చేశారని ప్రజలు ఓట్లు వెయ్యాలని హేళన చేశారు.

మోడీ మూడు నల్ల చట్టాలు తెచ్చి 750 మంది రైతుల చావుకు కారణమైండన్నారు. 180 ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ కట్టిందని గర్వంగా చెప్పుకొచ్చారు. మోడీ సొంత రాష్ట్రంలో బీజేపీ నాయకుల ప్రచారాన్ని ప్రజలు అడ్డుకుంటున్నారని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేసిందని నిలదీయండని ప్రజలను కోరారు. ఇకపై బీజేపీ మాయమాటలను, మోసాలను ప్రజలు నమ్మరని, బీజేపీ హయాంలో యువత మాదకద్రవ్యాలకు, జూదాలకు అలవాటు పడ్డారని సామ రామ్మోహన్ రెడ్డి వెల్లడించారు.


Similar News