Sajjanar:వియార్ సారీ.. కండక్టర్ల లూటీ ఘటనపై స్పందించిన సజ్జనార్

కండక్టర్ల లూటీ ఘటనపై స్పందించిన సజ్జనార్ స్పందించారు.

Update: 2024-08-05 09:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ఎంత ప్రశంసలు అందుకుంటున్నదో అంతే స్థాయిలో విమర్శలపాలవుతున్నది. తాజాగా కొంత మంది కండక్టర్ల లూటీ నిర్వాకాన్ని ఓ నెటిజన్ బయటపెట్టగా దానిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రియాక్ట్ అయ్యారు. కొందరు కండక్టర్లు మహాలక్ష్మి స్కీమ్ ను తమ లూటీ కోసం ఉపయోగించుకుంటున్నారని పురుషుల వద్ద టికెట్ చార్జి వసూలు చేస్తూ వారికి మాత్రం ఫ్రీ టికెట్ ఇస్తున్నారని ఓ నెటిజన్ ఆరోపించారు. ఇదేంటని ప్రశ్నిస్తే పొరపాటున అలా జరిగిందని ఆ టికెట్ ను చంచివేసి మరో టికెట్ ఇస్తున్నారని.. జూన్ 26 తేదీన, జులై 7వ తేదీన ఆగస్టు 4వ తేదీన తన వద్ద డబ్బులు తీసుకుని కండక్టర్లు మహాలక్ష్మి స్కీమ్ కు సంబంధించిన టికెట్లు ఇచ్చారని సదరు నెటిజన్ ఎక్స్ (ట్విట్టర్)లో తన అనుభవాన్ని షేర్ చేశాడు. ఇది మామూలు లూటీ కాదని.. ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు ట్యాగ్ చేశాడు. స్పందించిన సజ్జనార్.. జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఈ ఘటనకు బాధ్యలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహాలక్ష్మి టికెట్లపై మరింత నిఘా పెట్టాలని ఈ తరహా జరుగుతున్న మోసాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు. 

Tags:    

Similar News